రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై హిట్‌మ్యాన్ పరోక్షంగా స్పందించాడు. భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ ప్రచారాలను కొట్టిపారేశాడు. 'బయట ఏం జరుగుతుందో దాంతో నాకేం సంబంధం' అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
రిటైర్మెంట్ వార్తలపై పరోక్షంగా స్పందించిన రోహిత్


