రానున్న ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతక రేసులో ఉంటుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ప్రత్యర్థులకు కచ్చితంగా ఆమెతో ప్రమాదమేనని తెలిపాడు. చెన్ యుఫీయ్, హన్‌యూలను సింధు ఓడించగలదని చెప్పాడు. అయితే, ఆన్ సె యంగ్‌పై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా ఉందన్నాడు. ప్రస్తుతం ఉన్న షట్లర్లలో ఎక్కువమంది సింధు ఆట శైలిని చదవలేకపోతున్నారని వెల్లడించాడు.
క్రీడలు
పీవీ సింధుతో ప్రత్యర్థులకు ప్రమాదమే: గోపీచంద్


