హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రిస్‌ గేల్‌ కాళ్లు మొక్కిన బ్రావో

మేజర్ క్రికెట్ లీగ్ ఫైనల్ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ కోచ్ డ్వెయిన్ బ్రావో.. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను కలిసి ఆయన పాదాలకు నమస్కరించి గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా గేల్‌ను 'ఒరిజినల్ గోట్' అని కొనియాడాడు. ఈ ఆత్మీయ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రావో శిక్షణలో నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.