హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు గోల్కొండలో సామూహిక బోనాల ఉత్సవం

TG: గోల్కొండ జగదాంబిక అమ్మవారి సామూహిక బోనాల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ జరిగే ఈ వేడుకకు దాదాపు 5 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా వేసింది. లక్షలాది భక్తుల రాక, డప్పు చప్పుళ్ల మధ్యన పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట దద్దరిల్లనుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు తరలిరానుండటంతో అధికారులు భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.