హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం సమీపంలోని ఆనందపురం- అనకాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు.. లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.