హైదరాబాద్: 28°C
వార్తలు

'క్షేత్రస్థాయి నుంచే బీజేపీ బలోపేతానికి కృషి'

KKD: రౌతులపూడి మండల కేంద్రమైన రౌతులపూడిలో బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. బీజేపీ నాయకులతో కలిసి పూజలు చేశారు. వార్డు స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘జనతా వారధి’ని నిర్వహిస్తున్నామన్నారు.