హైదరాబాద్: 28°C
వార్తలు

టీఆర్పీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత

WNP: జిల్లాకు చెందిన BRS సీనియర్ నేత మనోహర్ గౌడ్ ఆ పార్టీని వీడి TRPలో చేరారు. ఆయనకు పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మనోహర్ గౌడ్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల ఆధీనంలో కొనసాగుతున్న బీఆర్ఎస్‌లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్పీ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు.