ATP: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో వర్షాలు కురవాలని గ్రామస్థులు వినూత్నంగా గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. గతంలో కూడా ఈ ఆచారాన్ని పాటించిన తర్వాత గ్రామంలో మంచి వర్షాలు కురిశాయని గుర్తు చేసుకున్నారు. ఈసారి కూడా వర్షదేవుడు కరుణించి, పంటలు బాగా పండుతాయనే గట్టి నమ్మకంతోనే తాము ఈ వింత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు.
వార్తలు
VIDEO: వింత.. వర్షాల కోసం గాడిదల పెళ్లి


