హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం

దేశంలోనే తొలి హైడ్రోజన్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్లు పరుగులు తీయనుంది. ఈ నేపథ్యంలో ఈ రైలు టికెట్ ధరలను సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ నిర్ణయించింది. కనీస టికెట్ ధర 10 రూపాయలుగా ఉండగా, జింద్ నుంచి సోనిపట్ వరకు పూర్తి ప్రయాణానికి గరిష్ట ధరను 25 రూపాయలుగా ఫిక్స్ చేసింది.