హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు బద్వేలులో మెగా ఉద్యోగ మేళా

 KDP: బద్వేలులోని స్థానిక రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాలలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ఏవో వెంకటసాయికృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు 19వ తేదీ నేరుగా కళాశాలలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.