హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ధనూరా-టేక్మాల్ రోడ్డు అధ్వాన్నం

MDK: టేక్మాల్ మండలం ధనూరా నుంచి టేక్మాల్ వెళ్లే ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. రోడ్డుపై గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.