హైదరాబాద్: 28°C
వార్తలు

పులివెందుల ట్రాఫిక్ ఎస్సైగా గంగాధర్ రెడ్డి!

KDP: పులివెందుల పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ట్రాఫిక్ ఎస్సై‌గా గంగాధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు వాహనాలకు సంబంధించిన పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.