హైదరాబాద్: 28°C
వార్తలు

దేవెగౌడకు ఫోన్ చేసి పరామర్శించిన మోదీ

మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ అనారోగ్య సమస్యతో ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. చెన్నమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖ సమయంలో దేవెగౌడ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా చెన్నమ్మ చేస్తున్న సమాజ సేవను, ఆమె నిరాడంబరతను ప్రధాని కొనియాడారు.