హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు తిరుప్పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెంగపల్లి రహదారిపై అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.