హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా రద్దు

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేకు పడింది. అమర్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటం, మంచు కొండల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాత్రకు భక్తులను అనుమతించేదని లేదని చెప్పారు. అలాగే యాత్రా మార్గాల్లో గగనతల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు.