హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్లకు కాటుక పెడుతున్నారా..?

కళ్లకు కాటుక పెడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. కళ్లు శరీరంలోనే అత్యంత సున్నితమైన భాగం. నాణ్యత లేని కాటుక వాడటం వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. మంచి బ్రాండ్లను ఎంచుకోవాలి. గడువు ముగిసిన వాటిని వాడకూడదు. పడుకునే ముందు కాటుకను తప్పనిసరిగా తొలగించాలి. కళ్లలో ఎరుపు, దురద లేదా మంటగా అనిపిస్తే వెంటనే వాడటం ఆపి, నిపుణులను సంప్రదించాలి.