హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మృదువైన పాదాల కోసం..!

మృదువైన పాదాల కోసం కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ మిశ్రమంతో స్క్రబ్ చేయడం లేదా తేనెతో మసాజ్ చేయడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి. గాయాలున్నప్పుడు చేయకూడదు. రోజూ మాయిశ్చరైజర్ తప్పనిసరి. బిగుతుగా ఉండే షూస్ వేయకూడదు.