హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అల్లం ముక్క నమిలితే.. అద్భుత లాభాలు

అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు రోజూ చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, గొంతు గరగరలను అల్లం త్వరగా నయం చేస్తుంది. అల్లం రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగడం వల్ల గొంతులోని ఇన్ఫెక్షన్లు తగ్గిపోయి శ్వాస వ్యవస్థ క్లియర్ అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.