AKP: నర్సీపట్నంలో నాటు కోళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. శనివారం వారపు సంత నాటు కోళ్ల కొనుగోలు అమ్మకాలతో కిటకిటలాడింది. ఆషాడ మాసం కావడంతో మొక్కులు తీర్చుకోవడానికి పలువురు నాటు కోళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక నాటుకోడి ధర రూ. 5 వేలు పలకటం విశేషం. ప్రతి వారం లక్షల రూపాయల నాటు కోళ్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.
వార్తలు
VIDEO: నాటు కోళ్లకు పెరిగిన డిమాండ్


