SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని BC స్టడీ సర్కిల్ ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు మూసివేయాలని మున్సిపల్ అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వార్తలు
పైప్ లైన్ కోసం తవ్వి వదిలేశారు!


