హైదరాబాద్: 28°C
వార్తలు

గాలివీడులో భారీ చోరీ

అన్నమయ్య: గాలివీడులోని పూసల కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు సంతకు వెళ్లిన సమయంలో తలుపులు, బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.