హైదరాబాద్: 28°C
క్రైమ్

ప్రేమజంట ఆత్మహత్య

TG: నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. కట్టంగూర్ మునుకుంట్లలో ఉరేసుకొని లక్ష్మీ ప్రసన్న అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రసన్న మృతితో చరణ్ అనే యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు. దీంతో చరణ్ తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, చరణ్ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.