హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశుభ్రత పాటించని షాపులకు జరిమానా

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.వనిత ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు షాపులకు రూ.5 వేల చొప్పున, ఒక టిఫిన్ సెంటర్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో వార్డు ఆఫీసర్ శ్రీకాంత్, జవాన్ ప్రవీణ్ పాల్గొన్నారు. వ్యాపారులు మున్సిపల్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని వనిత హెచ్చరించారు.