హైదరాబాద్: 28°C
వార్తలు

సుద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్

NRML: భైంసా పట్టణంలోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, తాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు పరిపాలనా అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు.