అన్నమయ్య: మదనపల్లె బెంగళూరు బస్టాండ్‌లో శనివారం ఓ మధ్యవయస్కుడు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానిక యువత చొరవతో 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద కడప–మదనపల్లె బస్సు టికెట్ లభించగా, అతడు కడప వాసి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. గుర్తింపు పత్రాలు లేకపోవడంతో వివరాలు తెలియరాలేదు.
వార్తలు
మదనపల్లె బస్టాండ్‌లో కుప్పకూలిన వ్యక్తి


