హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజమార్కా ప్రాంతంలో మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బస్సు 650 అడుగుల లోతులో పడడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రెస్క్యూ బృందాలు తాళ్ల సాయంతో కిందకు దిగి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.