హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. 12 వేల మంది మృతి

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఐరోపాలో జూన్ నెలలో ఏకంగా 12 వేలకు పైగా మరణాలు సంభవించాయి. యూకే, స్విట్జర్లాండ్‌లలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఈ మరణాలు సంభవించినట్లు బ్రిటన్ వాతావరణ శాఖ వెల్లడించింది. భూతాపం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.