హైదరాబాద్: 28°C
క్రైమ్

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కట్వా ప్యాసింజర్ రైలు స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఇద్దరు స్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే గేటు తెరిచి ఉండటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.