హైదరాబాద్: 28°C
వార్తలు

వాడపల్లిని టెంపుల్‌ను అభివృద్ధి చేయాలని సీఎంకు వినతి

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి, కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రాన్ని టెంపుల్ టౌన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. వాడపల్లి ఆలయ అభివృద్ధి సమగ్ర ప్రణాళికను అందజేయడంతో పాటు, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకు స్థలం కేటాయింపు చేయాలని కోరారు.