హైదరాబాద్: 28°C
క్రైమ్

గంజాయి ముఠా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్

TG: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్‌నగర్ కాలనీలో గంజాయి సేవిస్తున్న వారిని పట్టుకున్నారు. విచారణలో శంషాబాద్ ఆర్‌జీకే క్వార్టర్స్‌లో గంజాయి అడ్డా గుట్టురట్టు అయింది. గంజాయి ముఠా నుంచి 8.5 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన పెడ్లర్ సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.