హైదరాబాద్: 28°C
వార్తలు

అశ్వరావుపేటలో నేడు ఎమ్మెల్యే పర్యటన

BDK: అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ వట్టి వెంకట్రావు ప్రకటించారు. ముందుగా నియోజకవర్గంలో మూడు కోట్ల 18 లక్షల 50వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అన్నారు. సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.