VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం ధర్మవరంలో జల్ జీవన్ మిషన్ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెంటవీధిలో 85 ఇళ్లకు నూతన తాగునీటి కుళాయి కనెక్షన్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందించి ప్రజల నీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వార్తలు
'తాగునీటి కష్టాలు తీర్చటమే లక్ష్యం'


