హైదరాబాద్: 28°C
క్రీడలు

మెస్సీపై ట్రంప్ ప్రశంసలు

అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మెస్సీ ఆటతీరు అద్భుతంగా ఉందన్నారు. అతడు గొప్ప ప్లేయర్ అని కొనియాడారు. ఇలాంటి ఆటగాళ్లు పుట్టుకతోనే ఏదో అదనపు లక్షణాన్ని కలిగి ఉంటారని అన్నారు. రొనాల్డో కూడా ఆ కోవకు చెందిన ప్లేయరే అని పేర్కొన్నారు. అలాగే, ఇంగ్లండ్ మేనేజర్ టచెల్ నిర్ణయాలు సరిగా లేవంటూ వ్యాఖ్యానించారు.