హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. BCCI క్లారిటీ

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా రేపు జరగబోయే 3వ వన్డే అనంతరం రోహిత్ శర్మ రిటైర్ అవుతారన్న వార్తలపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. 'రోహిత్ రిటైర్మెంట్ గురించి చర్చలు జరగలేదు. లార్డ్స్‌లో జరిగే వన్డే ఆయనకి చివరి మ్యాచ్ కాదు. వన్డే టీమ్‌లో రోహిత్ రెగ్యులర్ మెంబర్, కీ ప్లేయర్. జట్టులో ఉన్నంతకాలం ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడు' అని తెలిపారు.