జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. సైఫ్ హస్సన్ (55), తంజిద్ హసన్ (58) హాఫ్ సెంచరీలతో 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రిషద్ హొస్సేన్ (4/26) ధాటికి జింబాబ్వే 152 పరుగులకే ఆలౌటైంది. కీలకమైన మూడో టీ20 జూలై 19న జరగనుంది.
క్రీడలు
జింబాబ్వేపై బంగ్లాదేశ్ ప్రతీకారం


