హైదరాబాద్: 28°C
వార్తలు

​రేపు ఇంఛార్జ్ మంత్రి రాక

MDK: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ఉదయం 9:15 గంటలకు చేగుంటలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ నిర్వహించే ‘ఎల్‌నినో’ అవగాహన సదస్సులో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. మంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.