హైదరాబాద్: 28°C
క్రీడలు

50 ఓవర్లు ఆడలేరా?: కైఫ్ 

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమిపై మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అక్షర్, సుందర్, దూబే లాంటి ఆల్‌రౌండర్లతో 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉన్నా టీమిండియా 50 ఓవర్లు పూర్తిగా ఆడకపోవడాన్ని తప్పుపట్టాడు. పూర్తిగా బ్యాటింగ్ చేసి ఉంటే మరో 30-50 పరుగులు వచ్చేవి అన్నాడు. సీనియర్లు నేర్పిన మొదటి పాఠం 50 ఓవర్లు ఆడడమేనని గుర్తుచేశాడు.