హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా కెప్టెన్లను మార్చండి: మిథాలీ రాజ్

టీమిండియా మహిళల జట్టు కెప్టెన్సీలో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. స్మృతి మందానను వెంటనే వన్డే జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించాలని ఆమె కోరింది. నిజానికి చాలా కాలం క్రితమే స్మృతికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిందని పేర్కొంది. అలాగే, టీ20ల్లో యువ ఆటగాళ్లు షెఫాలీ వర్మ లేదా జెమీమాకు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలని సూచించింది.