హైదరాబాద్: 28°C
క్రీడలు

లండన్ చేరుకున్న రోహిత్ తల్లిదండ్రులు..!

ఇంగ్లండ్‌తో ఈనెల 19న లార్డ్స్ వేదికగా భారత్ ఆడబోయే వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరిది కానుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రోహిత్ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ లండన్ చేరుకున్నట్లు పలు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. రోహిత్ చివరి మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా తన తల్లిదండ్రుల కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.