ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా సుందర్ తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
భారత జట్టుకు గట్టి షాక్


