హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలిసారి జపాన్ ఓపెన్‌ సెమీస్‌కు పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ స్టార్ నొజుమితో సింధు తలపడాల్సి ఉంది. కానీ, నొజుమి వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దీంతో ఆమె సెమీస్‌కు దూసుకెళ్లింది. సింధు ఇప్పటివరకు ఒక్కసారి కూడా జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోలేకపోయింది.