హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా..?

మిగిలిన ఆహారాన్ని పదేపదే వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం. ఇలా చేయడం వల్ల పోషకాలు నశించడమే కాకుండా, బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. అన్నం, కూరగాయలు, మాంసాహారాన్ని పదేపదే వేడి చేయడం ద్వారా 'ఫుడ్ పాయిజనింగ్' వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు తాజాగా వండుకుని తినడం ఉత్తమం. ఒకవేళ నిల్వ ఉంచాల్సి వస్తే, ఫ్రిజ్‌లో భద్రపరిచి, ఒక్కసారి మాత్రమే వేడి చేసి తీసుకోవడం మంచిది.