హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మ.. లార్డ్స్‌ వన్డేనే ఆఖరా?

రోహిత్ శర్మ వన్డేలకు సైతం వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే వన్డేనే కెరీర్‌లో అతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని తెలుస్తోంది. ఈ సిరీస్ తర్వాత సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదని సమాచారం. అయితే, రోహిత్ తన భవిష్యత్తుపై తానే నిర్ణయం తీసుకోవాలని ఓ BCCI అధికారి వ్యాఖ్యానించాడు.