హైదరాబాద్: 28°C
క్రీడలు

'రో-కో' జోడీ అరుదైన రికార్డ్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 8000 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఈ ఘనత సాధించారు. దీంతో భారత్ తరఫున ఈ మైలురాయి దాటిన 3వ జోడీగా.. గంగూలీ-సచిన్, ద్రవిడ్-సచిన్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 9వ జోడీగా రికార్డుకెక్కారు. కాగా, అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు జయవర్దనే-సంగక్కర (13,368) పేరిట ఉంది.