హైదరాబాద్: 28°C
క్రీడలు

హిట్ మ్యాన్ సరికొత్త రికార్డ్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో సిక్సర్‌తో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 56 సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో రిషభ్ పంత్ (55) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (53), ఎంఎస్ ధోనీ (52) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.