హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒత్తిడిలో వికెట్ పారేసుకున్న రోహిత్

రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. తొలి వన్డేలో 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తాజాగా రెండో వన్డేలోనూ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుసగా 9 డాట్ బాల్స్ ఆడటంతో రోహిత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే జాక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు ప్రయత్నించి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.