హైదరాబాద్: 28°C
క్రీడలు

కేఎల్ రాహుల్‌కు ఏమైంది..?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేకు స్టార్ బ్యాటర్ KL రాహుల్ దూరమయ్యాడు. దీంతో అతడు ఈ మ్యాచ్‌లో ఎందుకు ఆడటం లేదని అభిమానుల్లో తీవ్ర చర్చ సాగింది. అయితే, టాస్ సమయంలో కెప్టెన్ గిల్ దీనిపై స్పష్టతనిచ్చాడు. రాహుల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా, ఇషాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.