హైదరాబాద్: 28°C
వార్తలు

నాచారం చెరువు పునరుద్ధరణకు శ్రీకారం

RR: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. రూ. 28 కోట్లతో చేపట్టిన అభివృద్ధిలో పాత్‌వేలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు, యోగా వేదికలు ఏర్పాటు చేయనున్నారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.