హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా బౌలర్‌కు ఐసీసీ షాక్

టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బెన్ డకెట్‌తో గుర్నూర్ వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడి వైపునకు ప్రమాదకరంగా బంతిని విసిరాడు. అయితే, ఆ బంతి తగలకుండా డకెట్ పక్కకు తప్పుకున్నాడు. మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ గుర్నూర్‌ను మందలించిన ఐసీసీ, అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.