హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-బంగ్లా సిరీస్‌లో మార్పుల్లేవు: BCB

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఈ సిరీస్ 2026 సెప్టెంబర్‌కు వాయిదా పడింది. అయితే, ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) స్పందిస్తూ.. ఈ సిరీస్‌లో ఏ మార్పులు లేవని, యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. దీనిపై BCCIతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.